26, మార్చి 2009, గురువారం

1 కామెంట్‌లు

శ్రీ విరోధినామసంవత్సరం

యుగానికి ఆది ......... ఉగాది

చైత్రమాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమే అహని
శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి

ప్రవర్తయామాసతథాకాలస్యగాననామపి

గ్రహన్వారానృనాత్మూసాన్వత్సరాదిపాన్ !!




బ్రహ్మ దేవుడు తన సృష్టిని బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో, మొదటిమాసమైన చైత్రమాసంలో, ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువులో, మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, మొదటి వారం అయిన ఆదివారం, మొదటి నక్షత్రం అయిన అశ్విని నక్షత్రంలో ప్రభావిమ్పజేశాడు. అదే యుగానికి ఆది ......... ఉగాది
సంకల్ప మంత్రాలకు ఆధారమైన బ్రహ్మకల్ప, శ్వేతవరాహకల్పమును తెలుపుతూ భగవత్ అర్చనలో భాగంగా నిత్యం

" శ్రీ మహావిష్నోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అధ్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేత వరాకాల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ' శాలీవాహనశకే

" .......... అని వేదములోని కాలమానము తెలుపుతున్నది. శాలీవాహన చక్రవర్తి క్రీస్తుశకం 79 సం.|| లో పట్టాభిషిక్తుదయ్యాడు. ఆకారణంగా ఈ యుగాన్నిశాలీవాహనశకంగా పేర్కొన్నారు. క్రీస్తుశం నాలుగో శతాబ్దంలో వరాహమిహురుడు వసంత విషువత్ కాలాన్ని సంవత్సరాదిగా ప్రకటించారంటారు. చాంద్రమానాన్ని అనుసరించి మాసగణనం చేయాలని, శుక్లపక్షంతో నేలను లేక్కించాలని కమలాకరభట్టు పేర్కొన్నారని చెబుతారు. చైత్ర శుద్ధ పాడ్యమిని ప్రతిసంవత్సరము శుభదినంగా, సంవత్సరాదిగా.... ఉగాదిగా నిర్దేశించారు. చైత్రమాస శుక్ల పక్షమి ప్రతిపదాతిథి పాడ్యమి సూర్యోదయ సమయములో సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ జగత్తును రచించాడని జ్యోతిషానికి సంబందించిన హిమాద్రి గ్రంథములో చెప్పారు. సంవత్సరం ఆరంభమయ్యే రోజున సూర్యోదయం సమయంలో పాడ్యమి తిథి ఎప్పుడు ఉంటుందో ఆరోజే ఉగాది.పండుగగా నిర్దేశించారు. సృష్ట్యాదిని చరితార్థం చేయడానికే సృష్టి ఉద్భవించిన మొదటి సంవత్సరం " ప్రభవ " అన్న పేరుతో ప్రారంభమై బ్రహ్మకల్పం అంతమయ్యేవరకు చివరి సంవత్సరం " క్షయ " నామ సంవత్సరంతో ముగియడం విశేషం. భారతీయతకు మూలం వేదం. వేదంలో చెప్పబడ్డ మధు, మాధవ మాసములు జ్యోతిష శాస్త్రం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాలుగా నిర్ధారించారు. చిత్తా నక్షత్రంతో సంబంధమున్నది చైత్రమాసం. జగత్కళ్యాణదాయకం అయిన శ్రీరామ పట్టాభిషేకానికి వసంత సమయమే సముచితమని భావించి వశిష్టాది మహర్షులు శ్రీ రామావతారానికి ప్రేరణగా నిలిచారు. ద్వాపర యుగం ముగిసిన తరువాత విధాత కలియుగాన్ని ఈరోజే ప్రారంభిచాడని పురాణ కథనం. మహాభారత కాలంనుంచీ ఉగాది పర్వాన్ని నిర్వహిచుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

mallikarjunasharma

0 కామెంట్‌లు
Posted by Picasa

mallikarjunasharma

0 కామెంట్‌లు