22, జూన్ 2010, మంగళవారం

0 కామెంట్‌లు
తీర్ధయాత్ర. ఈ లోకంలో ఎక్కడెక్కడో ఎన్నెన్నో .... కనీసం ఉహలకు అందనివిధంగా చాల గొప్పనైన ఆలయాలు ఉన్నాయి. అటువంటి కొన్ని దేవాలయాలను మనం ప్రయత్నిస్తే దర్శించుకోగలుగుతాము. మరికొన్ని చూడలేము. కారణాలేమైన ఇక్కడ అప్రస్తుతము. మీరు చింతించ నవసరము లేదు. మహోన్నతమైన, మహత్తరమైన కొన్ని దేవాలయాలును మీకు పరిచయము చేసే ప్రయత్నమే ఈ తీర్ధయాత్ర.
ఏకవీర దేవి ఆలయం.
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా.. మీకు ఏకవీర దేవి ఆలయ ప్రాశస్త్యాన్ని పరిచయం చేస్తున్నాం. ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ధులియా పట్టణం సమీపంలోని పంజహర్ నదీ తీరంలో వెలసివుంది. ఈ దేవత కేవలం మహారాష్ట్ర వాసులకే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తుల మనస్సుల్లో కొలువైవుంది.

ఆదిశక్తి ఏకవీర దేవి పరశురాముని తల్లిగా అందరికి సుపరిచితం. ఏకవీర, రేణుకా దేవిలు ప్రతిరూపమే ఆదిమాయ పార్వతీ దేవి. ఆమె అనేక దయ్యాలను సంహరించినట్టు పురాణాలు చెపుతున్నాయి. పౌరుషానికి ప్రతిరూపంగా పేరొందిన పరశురాముని తల్లిగాను, జమదగ్ని భార్య అని పురాణాలు చెపుతున్నాయి. రేణుకాదేవికి మరో పేరే ఏకవీరా దేవి.

సూర్యోదయం సమయాన ఆలయంలో కనువిందు చేసే ప్రకృతి రమణీయతను చూడొచ్చు. ఉదయించే సూర్య కిరణాలు దేవత విగ్రహంపై పడి, అవి వెదజల్లే కాంతిలో దేవీమాత ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. దీనికి తోడు పంజహార్ నదీ తీరం మరింత శోభాయమానంగా వుంటుంది. ఏకవీర దేవి విగ్రహం వెనుక




భాగాన గణేష్, తుకైమాత విగ్రహాలు ఉన్నాయి.

దశపాపహర దశమి

0 కామెంట్‌లు

" జ్యేష్టమాసి, సితేపక్షే,
దశమ్యాం, బుధ హస్తయో,
వ్యతీపాతే, గరానందే,
కన్యాచంద్రే, వృషౌరవౌ|| "


జ్యేష్ట మాసము, శుక్లపక్షం, దశమి, వ్యతీపాత యోగము, గర కరణము, బుధవారము,హస్తా నక్షత్రములున్నందు వలన ఆనంద యోగము, కన్య యందు చంద్రుడు, వృషభమందు రవి, ఇవి పదిరకాలైన కాల విశేషాలు. ఈ పదీ కలిసి వచ్చిన రోజును దశపాప హర వ్రతము చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే దశపాప హర వ్రత లక్షణములు. 
ఇక దశవిధ పాపములు :-
1. ఒకరి వస్తువు వారికివ్వకుండా తీసుకోవడం,

2. శాస్త్రము ఒప్పని హింసను చేయడం,

3. పర స్త్రీని కలవడం - ఇవి మూడు శరీరం తో చేసేవి.

4. పరుషము, 5. అసత్యము, 6.కొండెములు, 7. అసంబద్దమైన మాటలు - ఇవి నాలుగూ మాట ద్వారా చేసేవి.

8. ఇతరుల ధనములందు కోరిక,

9. ఇతరులకు ఇష్టముకాని విషయములు చేయతలచడము,

10. వ్యర్ధమైన అహంకారము - ఇవి మూడూ మానసికంగా చేసేవి.ఇవే

పదిరకాలైన పాపాలు.

      ఈ పదిరకాలైన పాపాలూ చేయని మనిషి ఉంటాడా? అని ఆలోచించనక్కర్లేదు. ఏదో ఒక సమయాన ఏదో ఒక పాపం యెంత మంచి వ్యక్తీ అని పేరు పొందిన వారైనా సరే చేసి ఉండక తప్పదు. తప్పులు చేయడం. వాటిని గురించి ఆలోచించక పోవడం. తానూ చేసినవి తప్పులే కావు అనుకోవడం ఈ పది పాపాలకు మించిన పాపం.
      ఏది ఏమైనా మనం మంచి అదృష్టవంతులం, మనం చేసిన తప్పులూ వలన వచ్చే పాపాలూ కడిగేసుకునే ఉపాయాలు మన శాస్త్రాలు, మన పెద్దలూ, మనకు ముందే చెప్పారు.
       అంటే మనం చేసే తప్పులు తప్పక చేస్తామని ముందే ఊహించి మరీ ఉపాయాలు చెప్పారు. వాటిని ఆచరించడమూ, ఆచరించకపోవడమూ మాత్రం మన చేతిలో వుంటాయి. మరి మన బుద్ధి ఎటు ప్రవర్తిస్తుందో, చేయమంటుందో, వద్దంటుందో ఆ సింగినాదం అంటూ వదిలివేస్తుందో చూడాలి, ఏది ఎలా వున్నా దశాపాపహర దశమి మాత్రం మంచి పర్వదినమే .
      శరీరానింకి అంటిన ఎలాంటి మురికైనా సరే నీరు తప్పనిసరిగా కావాలి. అలాగే పాపాలూ పోగొట్టుకోవడానికి కూడా ఆ గంగే గతి, గంగాదేవిని ఆరాధించి సేవించవలసిందే.
      మొట్టమొదటగా దేవలోకంలో దేవకృత్యాలు చేయుటకు సృష్టికర్త అయిన బ్రహ్మ చేతి కమందలమునండు మాత్రమె వుండేది. గంగ, వామనావతార సమయాన బలిచక్రవర్తి వామనస్వామికి మూడడుగుల నేలను దానం చేసే సమయాన స్వామి పాదాలు కడగటానికి ఉపయోగించిన ఆ గంగ విష్ణుపాదోదకమై ఆ తరువాత కైలాస వాసి శంభుని జటయందు చేరి ఓ అలంకరణగా మిగిలివుంది. ఆ సమయాన భగీరథ మహారాజు ప్రయత్నముతో భూమిపైకి దిగి " భాగీరథి " అను పేరుతొ వందల కొద్దీ యోజనముల మేర ప్రవహించుచూ మనకు కనిపిస్తూవున్నది.  
       అదే పరమపావని గంగ. లోపలి, బయటి పాపములను కడిగివేసే ఆ తల్లే సర్వ భూతములనూ రక్షిస్తూవున్నది. అలాంటి గంగమ్మ తల్లిని స్మరిస్తేనే చాలు విష్ణులోకం ప్రాప్తిస్తుందని పెద్దలూ చెప్పారు. కల్మష నాశిని, కలుష హారిణి అయిన గంగను ' ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయన్యై, రేవత్యై, శివాయై, దక్షయై, అమృతాయై, విశ్వరూపిన్యై, నందిన్యైతే నమో నమః " అంటూ  జ్ఞాన ఐశ్యర్యాది షడ్గుణవతియు, దశవిధ పాపముల హరిన్చునదియు, నారాయణ మూర్తి పాదముల నుండి పుట్టినదియు, రేవతియు, శివయు, దక్షయు, అమ్రుతయు, విశ్వరూపిణియు, నందినియూ, అగు గంగాదేవికి నమస్కారము. అని నమస్కారం చేయడం శాస్త్రాలు చెప్పిన పధ్ధతి.  
   జీవనాధారమూ, ప్రాణాధారమూ, అయిన గంగ లేకుండా ఏదీ జరగదూ,ఉండదూ.
    అందుకే దశయోగ పర్వదినాన దశపాపహరయైన గంగను ఆరాధించడం ఆచారం.ఓ చిన్నప్రతి మయందు గానీ చెంబులోని తీర్ధమందు( కలశమందు గానీ ) గంగాదేవిని ఆవాహనము చేసి పూజించాలి. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించాలి. జ్యేష్టశుక్ల దశమి, ఆనాడు హస్తా నక్షత్రంతో కూడినప్పుడు గంగను యధావిధిగా స్తోత్రం చేసినవారికి అందని సౌభాగ్యాలుండవు. అష్టైశ్వర్యములూ ఇచ్చి ఆశీర్వదించే ఆ గంగమ్మ తల్లి కరుణ అనంతమైనది.
నందినీ నళినీ
సీతామాలినీ చ మహాపగా
విష్ణు పాదాబ్జ త్రిపధగామినీ
భాగీరథీ భోగవతీ
జాహ్నవీ త్రిదశేశ్వరీ

అంటూ గంగమ్మతల్లి పన్నెండు పేర్లనూ తలుస్తూ పదిమార్లు గంగలో మునగడం లేదా ఇంట్లోనైనా సరే  పదిమార్లుగా స్నానం చేయడం ఆచారం. స్నానం చేసేటప్పుడు నల్లనూవులు, పేలాలపిండి, బెల్లము చేసి గంగకు సమర్పించాలని శాస్త్రవచనం. దీనివల్ల జన్మజన్మాంతరాల్లో చేసిన పాపాలూ మూడూ విదాలైనవీ, శరీరంతో చేసిన మూడూ విధాలైన పాపాలూ, నోటి మాటతో చేసిన మూడూ రకాలైన పాపాలూ ( మొత్తం పది ) నశించిపోతాయని పెద్దలు చెప్తారు. అలాగే పది దీపములు పెట్టి గంగకు అర్పించడం శ్రేయస్సునిచ్చే ప్రక్రియ.  
     అలాగే పదిమంది బ్రాహ్మణులకు యవలు, నువ్వులు, దక్షిణ తాంబూలాలతో దానం చేయడం, గోదానం చేయలేక పోయినా చిన్న చిన్న ఆవు బొమ్మ దానం అయినా చేయాలి.
మనం చేస్తున్న పాపాలు వదిలించుకునే అద్భుతమైన కాలవిశేషం దశపాపహర  పర్వదినం.
..

మూలం : గురుప్రియ మాస పత్రిక

21 జూన్ 2010 సోమవారం నాడు దశపాపహర దశమి.

16, జూన్ 2010, బుధవారం

0 కామెంట్‌లు
పదిరకాలైన పాపాలను హరించి పుణ్యఫలాలను ఇచ్చే ఈ పర్వదినాన గంగాదేవిని ఆరాదించాలి. ఈ దశపాప హర దశమి గురించి రాబోయే నూతన పోస్ట్ లో తెలుసుకుందాం.
రాయప్రోలు మల్లికార్జున శర్మ. . .

23, మే 2010, ఆదివారం

1 కామెంట్‌లు
sakalapoojalu

జ్యోతిర్వాణి

7, మే 2010, శుక్రవారం

0 కామెంట్‌లు
sakalapoojalu

జ్యోతిర్వాణి part 1

0 కామెంట్‌లు
sakalapoojalu

sakalapoojalu.com

1, ఏప్రిల్ 2010, గురువారం

1 కామెంట్‌లు
sakalapoojalu