22, జూన్ 2010, మంగళవారం

తీర్ధయాత్ర. ఈ లోకంలో ఎక్కడెక్కడో ఎన్నెన్నో .... కనీసం ఉహలకు అందనివిధంగా చాల గొప్పనైన ఆలయాలు ఉన్నాయి. అటువంటి కొన్ని దేవాలయాలను మనం ప్రయత్నిస్తే దర్శించుకోగలుగుతాము. మరికొన్ని చూడలేము. కారణాలేమైన ఇక్కడ అప్రస్తుతము. మీరు చింతించ నవసరము లేదు. మహోన్నతమైన, మహత్తరమైన కొన్ని దేవాలయాలును మీకు పరిచయము చేసే ప్రయత్నమే ఈ తీర్ధయాత్ర.
ఏకవీర దేవి ఆలయం.
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా.. మీకు ఏకవీర దేవి ఆలయ ప్రాశస్త్యాన్ని పరిచయం చేస్తున్నాం. ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ధులియా పట్టణం సమీపంలోని పంజహర్ నదీ తీరంలో వెలసివుంది. ఈ దేవత కేవలం మహారాష్ట్ర వాసులకే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తుల మనస్సుల్లో కొలువైవుంది.

ఆదిశక్తి ఏకవీర దేవి పరశురాముని తల్లిగా అందరికి సుపరిచితం. ఏకవీర, రేణుకా దేవిలు ప్రతిరూపమే ఆదిమాయ పార్వతీ దేవి. ఆమె అనేక దయ్యాలను సంహరించినట్టు పురాణాలు చెపుతున్నాయి. పౌరుషానికి ప్రతిరూపంగా పేరొందిన పరశురాముని తల్లిగాను, జమదగ్ని భార్య అని పురాణాలు చెపుతున్నాయి. రేణుకాదేవికి మరో పేరే ఏకవీరా దేవి.

సూర్యోదయం సమయాన ఆలయంలో కనువిందు చేసే ప్రకృతి రమణీయతను చూడొచ్చు. ఉదయించే సూర్య కిరణాలు దేవత విగ్రహంపై పడి, అవి వెదజల్లే కాంతిలో దేవీమాత ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. దీనికి తోడు పంజహార్ నదీ తీరం మరింత శోభాయమానంగా వుంటుంది. ఏకవీర దేవి విగ్రహం వెనుక




భాగాన గణేష్, తుకైమాత విగ్రహాలు ఉన్నాయి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి